మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Mega158 రేపు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ముగ్గురు మెగా హీరోలు ఒకే వేదికపై కనిపించనుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.