ATP: వివిధ శాఖల అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధి హామీ, అంగన్వాడీ భవనాలు, జాతీయ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.