పవర్ స్టార్ పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రెండు రోజుల్లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాన్స్‌కు ‘రేపు ఫుల్ మీల్స్’ ఇవ్వబోతున్నామంటూ మూవీ నుంచి పవన్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. పోస్టర్లో పవన్ టోపీ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.