పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పౌరుల భద్రతను విస్మరించిన ప్రభుత్వానికి అక్కడి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. కోల్కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటనను ఉద్దేశిస్తూ.. బెంగాల్ ప్రజలు దేనినీ మర్చిపోలేదని తెలిపాడు. ఓట్ల రూపంలో ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని పేర్కొన్నాడు.