ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బన్నీ నాన్నమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అర్ధరాత్రి 1:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ముంబై నుంచి అల్లు అర్జున్ హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం.