కెపాప్ డిమాన్ హంటర్స్ చిత్రంలోని గోల్డెన్ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ఇటీవల గ్రామీ అవార్డును కూడా గెలుచుకున్న ఈ పాట, ఇప్పుడు ఆస్కార్‌ను సైతం కైవసం చేసుకుని ప్రపంచ వేదికపై కె-పాప్ సత్తాను చాటింది.