ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు ఊహించని ప్రశ్న ఎదురైంది. జస్టిస్ హేమ కమిటీపై ఓ రిపోర్ట్ ప్రశ్న అడగగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడెందుకు దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతున్నారన్నారు. ఇది దానికి సంబంధించిన వేదిక కాదని, ఇలాంటి కార్యక్రమంలో ఈ ప్రశ్న అడగడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇక ‘దసరా’ మూవీకి బెస్ట్ విలన్గా ఆయన అవార్డు అందుకున్నారు.