కోలీవుడ్లో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సూర్య హీరోగా AR మురుగదాస్ తెరకెక్కించిన ‘గజిని’ మూవీకి సీక్వెల్ రూపొందించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ను గెస్ట్ రోల్ కోసం తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న ‘జైలర్ 2’లో ధనుష్ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.