మోకాలి గాయం వల్ల పేసర్ మహ్మద్ షమీ కోలుకోవడం కాస్త ఆలస్యమవుతుందని ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. తాజాగా తాను పూర్తిగా కోలుకున్నట్లు షమీ తెలిపాడు. ‘నేను హాఫ్ రన్‌తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. దానికంటే ముందు రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.