TG: నిజామాబాద్ నవీపేట్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతగిరిలో మహిపాల్ అనే యువకుడు తన తండ్రి గౌరు అమృతాన్ని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సాధారణ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మహిపాల్‌ను విచారించగా.. పెళ్లి చేయకపోవడం వల్లనే తన తండ్రిని చంపినట్లు అంగీకరించాడు.