మహారాష్ట్రలోని రైతులకు బీజేపీ పెద్ద శత్రువుగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించినప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చుతామనే బీజేపీ చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రూ.20,000 కోట్ల వాటర్ గ్రిడ్ హామీని నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో 20వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.