కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్య సిబ్బంది ఎట్టకేలకు నిరహారదీక్షకు ముగింపు పలికారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్య బృందం తమ డిమాండ్లపై చర్చలు జరిపింది. ఈ భేటీని లైవ్‌గా ప్రసారం చేశారు. తమ డిమాండ్లకు సీఎం మమతా బెనర్జీ తలొగ్గడంతో దీక్షను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో మెడికో వైద్య విద్యార్థినిపై రేప్ అండ్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే.