కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో జులైలో నీట మునిగి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సంఘటన జరగినప్పుడే స్పందించడం కాకుండా ఎల్లప్పుడూ భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని.. కోచింగ్ సెంటర్లన్నీ ఏకరూప ప్రమాణాలు రూపోందించాలని తెలిపింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.