SDPT: జిల్లాలోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి మగ్గం వర్క్ బోటిక్ మేనేజ్మెంట్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు యూబీఐ రీజినల్ హెడ్ ఈద వికాస్ తెలిపారు. మొత్తం 30 రోజులపాటు తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18-40 ఏళ్లలోపు మహిళలు ఈ నెల 24 లోపు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.