సినీనటి అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి అనన్య మాట్లాడుతూ.. ‘ట్రైలర్లో కనిపించని చాలా కోణాలు దాగి ఉన్నాయి. ఈ సినిమాలో నేను బుజ్జమ్మగా కనిపించనున్నా. నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ‘మల్లేశం’ అనన్య, వకీల్‌సాబ్ అనన్య అని పిలుస్తున్నారు.. కానీ ఇకపై బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.