తమిళ నటుడు హరీష్ కళ్యాణ్, దినేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించిన మూవీ ‘లబ్బర్ పందు’. గ్రామీణ క్రికెట్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 20న రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా OTTలోకి రాబోతుంది. ఈ నెల 31 నుంచి డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది.