రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, భారత మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ ‘విట్నెస్’ పేరుతో రిలీజ్ చేసిన తన ఆత్మకథలో సంచలన విషయాలు తెలిపింది. చిన్నతనంతోనే తనను ట్యూషన్ టీచర్ వేధించాడని పేర్కొంది. ‘నా స్కూల్ డేస్లో ట్యూషన్ టీచర్ నన్ను వేధించేవాడు. నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. అందుకే నేను ట్యూషన్ కూడా వెళ్లడానికి భయపడేదాన్ని. అప్పుడు నాదే తప్పుందేమోనని దీని గురించి మా అమ్మకు కూడా చెప్పలేదు’ అని వెల్లడించింది.