TG: HYDలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హోటల్లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి దూకి యువకుడు మృతి చెందాడు. రామచంద్రాపురంలో ఉదయ్ అనే యువకుడు అతని స్నేహితులతో ఓ హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో మూడో అంతస్తు బాల్కనీలో ఉండగా.. కుక్క అతని వెంటపడింది. తప్పించుకునే క్రమంలో కిందకి దూకి ఉదయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.