న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఇంట్లో సంతోషం మరింత రెట్టింపైంది. సోమవారం సర్ఫరాజ్ సతీమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.