సీనియర్ నటి గౌతమికి అన్నాడీఎంకేలో కీలక పదవి దక్కింది. పార్టీ ఉప ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సోమవారం అధికారికంగా ప్రకటించారు. గౌతమి లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వైదొలిగి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు.