NDL: మహానంది మండలం గాజులపల్లి గ్రామ పరిధిలోని ఆంజనేయపురం గ్రామ సమీపంలోని నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిపై మంగళవారం వేకువ జామున ఆటోను మినీ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయపురం గ్రామానికి చెందిన నాగసుంకమ్మ, రంగస్వామి, శృతి లకు స్వల్ప గాయాలు అయ్యాయి. రోడ్డు భద్రత విభాగం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, 108 వాహనంలో గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.