బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి బీబీ సింగ్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ఆమె ఫ్రెండ్స్, అభిమానులు ‘స్టే స్ట్రాంగ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.