గాయం కారణంగా భారత్తో జరిగిన మొదటి టెస్టుకు దూరం అయిన కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ మేరకు అతను రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, పూణె వేదికగా గురువారం రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మూడు టెస్టుల సిరీస్లో NZ 1-0తో ఆధిక్యంలో ఉంది.