CTR: కుటుంబ సమస్యలతో ఓ టైలర్ సోమవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బి కొత్తకోట పోలీసులు తెలిపారు. కొత్తకోట పి.టీఎం రోడ్డులో ఉంటున్న టైలర్ శివయ్య (53) కుటుంబ సమస్యల కారణంగా మద్యంలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బాధితుని 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు.