CTR: కుప్పంలో ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు కోఆర్డినేటర్ రాజీవ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.