KRNL: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వారు అధికారంలో ఉన్నా మహిళల రక్షణకు భద్రత లేదని అన్నారు. హోంశాఖ మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ స్పందించి మహిళల రక్షణకు కృషి చేయాలని కోరారు.