TG: మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వాసుపత్రులలో స్కానింగ్ కోసం గర్భిణీలు ఎక్కువ సేపు వెయిట్ చేయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. అవసరమైతే స్కానింగ్ యంత్రాల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. గర్భిణులను గంటలకొద్దీ వెయిట్ చేయించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక గర్భిణులు, వారి వెంబడి వచ్చిన కుటుంబ సభ్యులు కూర్చునేందుకు సీటింగ్ అరెంజ్మెంట్ చేయాలన్నారు.