వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా లియామ్ లివింగ్‌స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే.