TG: ఉద్యోగాల విషయంలో రేవంత్ తీరు, రెండో ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 61వేల పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒక్క పోలీసు శాఖలోనే 30,731 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.