TG: హైదరాబాద్ జీపీ బిర్లా సెంటర్లో వరాస్ ఇంటర్నేషనల్ రాపిడ్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో భాగంగా విజేతలకు నగదు బహుమతి అందజేశారు. మొదటి బహుమతి తోట ధృవకు రూ.30 వేల క్యాష్ ప్రైజ్ అందజేశారు. రెండో బహుమతిగా ఆకుల ప్రణయ్‌కి రూ.20 వేలను.. కుందు కౌస్తవ్‌కు మూడో బహుమతిగా రూ.15 వేలను అందించారు. కాగా, విజేతలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ రాజశేఖర్ బహుమతులు అందజేశారు.