TG: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దోపిడీకి గురైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నిలువునా దోచేసిందని కామెంట్ చేశారు. రాజకీయాల్లో వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఆస్తులను ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ లేదని.. ఆ రెండు పార్టీలు కేవలం ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.