TG: ఆస్కార్ అవార్డు గ్రహిత రాహుల్ సిప్లిగంజ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్లోని జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో భట్టిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. రాహుల్ సిప్లిగంజ్ డిప్యూటీ సీఎంను కలవడం వెనుక మతలబు ఏమిటని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.