TPT: తిరుచానూరు పంచాయతీ ఇన్ఛార్జ్ ఈఓగా మాధురి సోమవారం బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది నూతన ఈఓకు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈఓ మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి దగ్గర పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య, డ్రైనేజి వ్యవస్థ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు.