కెనడాతో సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం కష్టమే. 1945 తర్వాత ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువగా ఉండేది. గడిచిన 20-25 ఏళ్లలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పాశ్చాత్యేతర దేశాల వాటా, భాగస్వామ్యం, ప్రభావం పెరిగింది. వివాదాలు, ఘర్షణలు, వాదనలు సహజమే. ఈ క్రమంలో కొన్ని దేశాల మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉండవు’ అని పేర్కొన్నారు.