NTR: విస్సన్నపేటలో 22 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపీడీవో సీహెచ్ చిన్న రాట్నాలు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. మొబైల్ నంబర్ అప్డేట్, వేలిముద్రలు, తదితర సేవలను పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.