TG: రాష్ట్రంలో మొదటి రోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ముగిసింది. ఇవాళ జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ టెస్ట్) పరీక్షను అభ్యర్థులు రాశారు. ఈ పరీక్షకు 87.23 శాతం మంది హాజరయ్యారు. 717 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష కొనసాగింది. ఈ నెల 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి. 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.