BPT: అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు సీఎం సహాయనిది అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పార్టీ కార్యాలయంలో సోమవారం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచన విధానంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు.