TG: అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు పెంచుతున్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ తెలిపింది. 2024-25 విద్యా సంవంత్సరంలో అదనంగా సీట్లు పెంచుతున్నట్లు వర్సిటీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సీట్లు పెంచింది. అదనంగా పెంచిన 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే ప్రత్యేక కోటాలో ఉన్న బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు ఫీజు తగ్గించింది.