బీహార్‌లో జరిగిన పోలీసుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం నితీశ్ పోలీసు సిబ్బంది నియామకాలను వేగంగా చేపట్టాలని డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అడిగారు. ఒక్కసారిగా చేతులు జోడించటంతో అవాక్కైన డీజీపీ.. సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. దీంతో డీజీపీకి సీఎం ధన్యవాదాలు చెప్పారు.