కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవో 29 రద్దు చేయాలని చెప్తున్నా.. అదే జీవో ప్రకారం ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తుందని మండిపడ్డారు. గ్రూప్ -1 పరీక్షలు చివరి వరకు కొనసాగేలా కనిపించట్లేదని జోస్యం చెప్పారు. అగ్రవర్ణాల ప్రజల కోసం 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్కు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.