బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతడి మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఓ బాలిక తండ్రి రూ.70 వేలు అప్పు తీసుకుని రూ.30 వేలు చెల్లించాడు. మిగతా రూ.40 వేల కోసం నిత్యం ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.