AP: అసెంబ్లీ సమావేశాలకు జగన్ను ఆహ్వానిస్తున్నాని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరం ముచ్చటించుకుందామని తెలిపారు. నర్సీపట్నంకు 100 రోజుల్లో రూ.40 కోట్లు తీసుకువచ్చానని, నాతవరానికి రూ.14 కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. తాండవ గేటు మరమ్మతు పనులు పూర్తి చేయించామని, పంట సీజన్ ప్రారంభమైన వెంటనే కొత్త గేట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.