PLD: రేషన్ డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొని అర్జీలు స్వీకరించారు. నియోజవర్గమంతా రేషన్ సరకులు సక్రమంగా అందించాలని అన్నారు. పప్పులు, నూనెలు పక్కదారి పట్టకుండా సక్రమంగా అమలు చేయాలన్నారు.