AP: కేంద్ర మంత్రి అమిత్ షాను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ఏపీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో లేదా అమరావతిలలో ఎక్కడైనా NFSU క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. బుడగ జంగాలకు సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలతో సహా వారి సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు.