VZM: గుర్లలో డయోరియా ప్రభావిత ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో నీటి సరఫరా పంప్ హౌస్‌ను పరిశీలించి నీటి నాణ్యతను, సరఫరా పరిస్థితులను తెలుసుకొన్నారు. ఆనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శంచి, వైద్యులతో మాట్లాడారు.