మహిళా నేత హోం మంత్రిగా ఉన్నప్పటికీ మహిళలు, బాలికలకు రాష్ట్రంలో రక్షణ లేకపోవడం దారుణమని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ హరినాథ్ అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా విస్సన్నపేటలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. హరినాథ్ మాట్లాడుతూ.. చీమకుర్తిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం దారుణం అన్నారు.