కృష్ణా: గన్నవరంకు చెందిన విద్యార్థులు ఫెన్సింగ్ పోటీలలో అండర్ 17 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు కోచ్ ధనియాల నాగరాజు తెలిపారు. గన్నవరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ కృష్ణా జిల్లా జట్టులో సీహెచ్ లావణ్య, జీ వినూత్న, కేకే పల్లవి, పీ జోష్మితలు నంద్యాలలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో కాంస్య పథకం సాధించినట్లు చెప్పారు.