»Standing Against Putin Is Death Prigogine On The Hit List
Russai పుతిన్‌కు ఎదురు నిలిస్తే మరణమే..హిట్ లిస్టులో ప్రిగోజిన్?
రష్యాలో పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ప్రాణ భయంతో బెలారస్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ కీలక విషయాన్ని సూచించాడు. పుతిన్ పగబట్టిన పాము కంటే చాలా డేంజర్ అని, ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటు చేసి వెనుదిరిగారు. ప్రైవేటు సైన్యం అయిన వాగ్నర్ గ్రూపు పుతిన్ అరాచకాలపై తిరుగుబాటు చేసింది. యెవెగెనీ ప్రిగోజిన్ నేతృత్వంలో ఇటీవల తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రాజీమార్గంలో రక్తపాతం లేకుండా ఆ తిరుగుబాటు నిలిచిపోయింది. దీంతో ప్రిగోజిన్ బెలారస్ దేశంలో తలదాచుకోవడానికి వెళ్లిపోయాడు.
ఈ ఘటనలపై అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక్కసారి పగబట్టాడంటే వదిలిపెట్టడని, గతంలో ఆయన చేతిలో చాలా మంది మరణించినట్లు గుర్తు చేశారు. పుతిన్ విరోధులు తెరిచి ఉంచిన కిటికీల్లోంచి కింద పడి మరణించిన ఘటనలు చాలా జరిగినట్లు తెలిపారు. ప్రిగోజిన్ కూడా తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, చావు తనకు దగ్గరగానే ఉందని పెట్రాయస్ హెచ్చరించాడు.
ఆవేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడంతో ప్రిగోజిన్ ప్రమాదంలో పడ్డాడని తెలిపాడు. ఆయన చేసిన తప్పు వల్ల వాగ్నర్ గ్రూపులోని తన సైన్యాన్ని దూరం చేసుకున్నట్లు తెలిపాడు. బెలారస్ వంటి కొత్త ప్రదేశంలో ప్రిగోజిన్ అప్రమత్తంగా ఉండాలని, పుతిన్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదని సూచించాడు. పుతిన్ కు గతంలో ఎదురు నిలిచిన వారికి మరణమే సంభవించిందని, ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ ప్రాణం కూడా ప్రమాదంలో ఉందని సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ తెలిపారు.