»Pakistan Heavy Rain Triggers In Karachi Multiple Roads Flooded Life Disrupted
Pakistan : కరాచీలో కరంట్ కట్.. వరదకు కొట్టుకుపోయిన కార్లు
పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే ప్రమాదం నెలకొంది.
Pakistan : పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే ప్రమాదం నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రి చిమ్మ చీకటిలో గడిపారు. రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కరాచీ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నెలకొంది. ఆ తర్వాత రోడ్లు జామ్ కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఫిబ్రవరి 4న నగరం చుట్టూ భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురువగా, పరిస్థితి మరింత దిగజారింది. కరాచీలోని 700 పవర్ ఫీడర్లు నిలిచిపోయాయి. దీంతో సగానికిపైగా నగరం అంధకారంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వర్షం నీరు చేరిందని స్థానిక మీడియా పేర్కొంది. బాల్డీ టౌన్, ఓరంగి టౌన్, నార్త్ కరాచీ, సుర్జనీ టౌన్, గుల్షన్-ఎ-మేమర్, ఓరంగి టౌన్, బహ్రియా టౌన్, సదర్, నార్త్ నజిమాబాద్, టవర్, లియాఖతాబాద్, నజీమాబాద్‌లో భారీ వర్షం పడింది.
کراچی کی بارش میں بلاول کی کمپین بہہ گئی ہے. پنجاب والوں پی پی پی کو ووٹ دینے سے پہلے کراچی اور سندھ میں پی پی پی کی 15 سالہ کارگردگی ضرور دیکھ لینا 🤣🤣#KarachiRainpic.twitter.com/ullxjDf1rF
పాకిస్తాన్ వాతావరణ శాఖ ఒక రోజు ముందే భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది. అయినా వర్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తక చర్యలు తీసుకోకపోవడంతో నగరంలోని చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి. రోడ్లపైనే చాలామంది ప్రయాణికులు వారి వాహనాలలో చిక్కుకున్నారు. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ వర్షాల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. కొన్ని నీటి పంపింగ్ స్టేషన్లు పనిచేయడం ఆగిపోయాయని తెలిపారు. వర్షపు కాలువలు పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మేయర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై వర్షపు నీటిని తొలగించాలని అన్ని జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్లను ఆదేశించారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ సూచన ఉన్నప్పటికీ, సింధ్ ప్రభుత్వం వర్షాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జెపిఎంసి)లోని గైనకాలజీ వార్డులోని ఆపరేషన్ థియేటర్, సివిల్ హాస్పిటల్ వార్డు నంబర్ 3లోకి వర్షం నీరు చేరింది.
یہ ابلتے گٹر کا پانی بتاتا ہے کہ پیپلز پارٹی اور اسکے اتحادیوں نے اس شہر کو کیا دیا اور دوبارہ منتخب ہوکر کیا دے سکتے ہیں, کراچی ایک گھنٹے کی بارش میں ڈوب گیا- #KarachiRainpic.twitter.com/WOVsvn31uZ