క్రాక్ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మెప్పించలేకపోయాడు రవితేజ. అందుకే ఇయర్ ఎండింగ్లో వచ్చి.. న్యూ ఇయర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు మాస్ మహారాజా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా.. డిసెంబర్ 23న థియేటర్లోకి వచ్చి మాస్ జాతర చేయిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే 10 కోట్లు, రెండో రోజు 19 కోట్లు, మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్నట్టు చెబుతున్నారు మేకర్స్. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నట్టు.. ఫుల్లుగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల మాస్ స్టెప్పులకు థియేటర్లు ఊగిపోతున్నాయి. దాంతో ధమాకా.. డబుల్ డోస్ ఇచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ధమాకా సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు అందించిన రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ.. ఈ కథని ముందుగా చరణ్‌కు వినిపించాడట. చరణ్ కోసమే ‘ఇంద్ర’ స్ఫూఫ్ రాసుకున్నాడట. అయితే కథ విన్న తర్వాత లాజిక్ లెస్‌గా ఉందని రిజెక్ట్ చేశాడట చరణ్. కానీ ఫైనల్‌గా ఈ కథ రవితేజ దగ్గర లాక్ అయిందట. అయితే.. చరణ్ చెప్పినట్టే.. ఈ సినిమాలో లాజిక్ లేని సీన్స్ చాలానే ఉన్నాయి. అలాగే కథ, కథనం రొటీన్ అని పెదవి విరుస్తున్నారు. కానీ రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, భీమ్స్ మాస్ బీట్స్‌తో ధమాకా పేలిందని అంటున్నారు. మొత్తంగా ధమాకాతో మాసివ్ కొట్టేశాడు రవితేజ.